SKLM: పాతపట్నంలో కొలువైన శ్రీ నీలమణి దుర్గమ్మ ఆలయం 50వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా వైశాఖ మాసం శనివారం పురస్కరించుకుని అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు రాజేశ్ ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు అలకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వాసుదేవరావు తెలిపారు.