ప్రకాశం: గాలివీడు ఎంపీడీవోపై జరిగిన దాడిని మద్దిపాడు మండల ఎంపీడీవో జ్యోతి ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది ఖండించారు. వారందరూ శనివారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. ఎంపీడీవోపై దాడి చేసిన వ్యక్తిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.