ELR: ఏలూరు అమీనాపేటలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాలను కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలు, బోధన, వసతి గృహాల పరిసరాల పరిశుభ్రత, టాయిలెట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. వసతి గృహాలను ఇంటిని మరిపించే విధంగా తీర్చిదిద్దాలని ఆమె సిబ్బందికి ఆదేశించారు.