NDL: తుఫాను కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మట్టి మిద్దెలలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పాణ్యం మండలం తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి సూచించారు. శనివారం ఆలమూరు గ్రామానికి చెందిన లక్ష్మన్న మిద్దె కూలిపోయిందన్న అర్జీని పరిశీలించి బాధితునితో మాట్లాడారు. అన్ని గ్రామాల్లో రెవెన్యూ, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు.