E.G: పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా వివిధ మండలాల TDP అధ్యక్షులకు గోపాలపురం MLA మద్దిపాటి శిక్షణ ఇచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు, లక్ష్యాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.