ASR: మన్యంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌కు కేబినెట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అరకులోయ కంజరితోటలో గిరిజనులు డిమాండ్ చేశారు. బస్కి, కురిడీలో ఈ ప్రాజెక్టు ఏర్పాటును విరమించుకోకపోతే బాణాలతో తరిమికొడతామన్నారు. నేడు అరకులోయలో ఉదయం 10 గంటల నుంచి జరగనున్న ర్యాలీలో ఆదివాసీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.