NLR: తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు గ్రామంలో ఇవాళ పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఏవో శిరీష రాణి వరి నాట్లు వేసుకున్న రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు. జింకు లోప సవరణ, ఎరువుల యాజమాన్యం, జీవన ఎరువుల ప్రాధాన్యత, వరిలో కలుపు నియంత్రణ మొదలగు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.