GNTR: రామగిరి పర్యటనలో వైఎస్ జగన్ భద్రతను పోలీసులు నిర్లక్ష్యం చేశారంటూ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మంగళవారం మండిపడ్డారు. అలాగే హెలికాప్టర్ విండ్షీల్డ్ ధ్వంసంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు పని చేస్తున్నారని ఆరోపించారు. అభిమానుల ముసుగులో అసాంఘికశక్తులు జగన్కు ప్రమాదం కలిగించేలా కుట్రలు చేస్తున్నారని అని అన్నారు.