ప్రకాశం: రాజ్యాంగం అందించిన సూత్రాలను, హక్కులను నిజమైన స్పూర్తితో అమలు చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు హెచ్.సి.ఎం.కళాశాల కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహంకు కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందని కలెక్టర్ చెప్పారు.