AKP: ఏడాదిలోగా జిల్లాకు గోదావరి జలాలను తీసుకువస్తామని నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త పీలా గోవిందు తెలిపారు. ఇవాళ స్థానిక పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. నియోజకవర్గంలో పంట కాలువలు ఆనకట్టల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని హామీ ఇచ్చారు.