ELR: పోలవరం నియోజకవర్గంలోని ఏజెన్సీ మండలాలను కలిపి ప్రత్యేక ఆదివాసి జిల్లాగా ప్రకటించాలని, దానికి ‘పూరేం సింగరాజు దొర’ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి సంక్షేమ పరిషత్ బుధవారం కుక్కునూరులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రత్యేక చట్టాలు, హక్కులు గిరిజనులకు అందడం లేదని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూరం సంజీవరావు తెలిపారు.