ASR: ఈ ఏడాది గిరిజన ప్రాంతంలో వలిసెలు పంట సాగును పెంచేందుకు రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి తెలిపారు. పరిశోధన స్థానంలో అభివృద్ధి చేసిన సీటీపీ-1 విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తామన్నారు. రైతులు నాట్లు వేసిన నుంచి కోతకు వచ్చే వరకు తమ శాస్త్రవేత్తల పర్యవేక్షణ ఉంటుందన్నారు.