AKP: రాంబిల్లి మండలం లోవపాలెం సముద్ర తీరా ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని మండల తెలుగు యువత అధ్యక్షుడు ఎరిపిల్లి అజయ్, మాజీ సర్పంచ్ చిట్టిబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్‌ను ఆదివారం కలిసి వినతి పత్రం అందజేశారు. సముద్రతీరంలో పరశురాముడు ఆలయం ప్రకృతి అందాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయన్నారు.