కృష్ణా: కూటమి ప్రభుత్వం పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 21మందికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.18,86,311లను సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ సహాయం వేగవంతంగా అందిస్తున్న చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.