తిరుపతి SVU పరిధిలో జనవరి 5వ తేదీ నుంచి M.A, MSC, M.Com, M.S Data Science, M.Ed, M.Lisc రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, వీటిని వాయిదా వేశామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం వెల్లడించారు. జనవరి 21 నుంచి నిర్వహిస్తామని ప్రకటించారు. NET పరీక్షల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని SFI నాయకులు రెక్టార్కు వినతిపత్రం అందజేశారు.