SKLM: ఆమదాలవలస పెద్ద జొన్నవలస గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర సివిల్ సప్లయర్స్ ఎండి మంజీర్ జిలాని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసి ఫర్మాన అహ్మద్ ఖాన్, ఎమ్మార్వో రాంబాబు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.