WG: ఆకివీడులో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు విపరీతంగా పెరిగిపోయాయి. తరచూ ప్రతి 10 నిమిషాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో గంటల తరబడి సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిపోయే విద్యుత్ వల్ల ఇళ్లలోని గృహోపకరణాలు కాలిపోతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.