ASR: పెదబయలు మండలం తురకలవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ గురించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.రాజశేఖర్ బుధవారం డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నా, మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.