నెల్లూరులోని 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో సోమవారం ఉదయం మంత్రి నారాయణ పర్యటించారు. వర్షంలోనే ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. చెప్పిన సమయానికే అందరికీ పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతినెలా ఒకటో తేదీనే నగదు అందజేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.