VZM: యూరియా లోటు లేదనే విషయాన్ని రైతులకు అర్ధం అయ్యేలా తెలియజేయాలని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. పీజీఆర్ఎస్ అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. మొదటి విడత పంపిణీ ఇంచుమించుగా పూర్తి చేసామని, రెండో విడత కూడా 30 శాతంపై పూర్తి చేసామని, మిగిలినవి వారంలోగా పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. 2వ విడత కోసం ఇండెంట్ పెట్టడం జరిగిందన్నారు.