CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ పురుషుల సాఫ్ట్బాల్ జట్ల ఎంపిక ఈ నెల 27న నిర్వహించనున్నట్టు జిల్లా ట్రెజరర్ దేవా తెలిపారు. జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 27న 9 గంటలకు ఎంపికలుంటాయన్నారు. జిల్లా స్థాయి జట్లకు ఎంపికయ్యే క్రీడాకారులు నవంబర్ 8, 9 తేదీల్లో పిడుగురాళ్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.