VZM: పైడితల్లమ్మ జాతర నేపథ్యంలో నిర్దేశించిన పనులన్నీ నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని సిబ్బందికి విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. శనివారం పలు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి ఆయన క్షేత్ర పర్యటనలు చేశారు. రామారాయుడు రోడ్డులో పర్యటించి పెద్దచెరువు చుట్టూ చేపడుతున్న సుందరీకరణ పనులను పర్యవేక్షించారు.