NLR: కావలి మండలం మహిళా సమైక్య 20వ సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో MLA కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆయన మహిళలు వేసిన ముగ్గులను పర్యవేక్షించి, ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, వంటకాలను రుచి చూసి అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. కొంతమంది మహిళలు మాట్లాడుతూ.. ఇటువంటి సేవ చేసే MLAని తాము చూడలేదని, మా ఇంటి బిడ్డగా, మా అన్నగా వచ్చాడని ప్రశంసించారు.