కోనసీమ: రాజోలు మండలం శివకోడు వైసీపీ సీనియర్ నేత వర్మ తాడేపల్లిలో శుక్రవారం మాజీ సీఎం జగన్తో భేటీ అయ్యురు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారని వర్మ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై జగన్ పలు సూచనలు చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని చెప్పారన్నారు.