KDP: తొండూరు మండలం సైదాపురం యాదవ వారి పల్లె రహదారి గుంతల మయంగా మారడంతో అవస్థలు పడుతున్నారు. ఈ దారిలో రాకపోకలు సాగించాలంటే వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ దారి వెంబడి బలిజపల్లె, సైదాపురం, యాదవ వారి పల్లె గ్రామాల ప్రజలు, రైతులు వెళ్తుంటారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ దారికి మోక్షం కల్పించాలని కోరుతున్నారు.