ATP: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రికి వస్తున్నారు. ఆయన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి ఉదయం 10 గంటలకు పట్టణానికి చేరుకునే అవకాశం ఉంది. పెద్దారెడ్డి రాక నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్ పట్టణంలో పోలీసు బలగాలను మొహరించారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.