KRNL: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలంలో గీత కార్మికుల మద్యం దుకాణాల కోసం 11 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సీఐ లలితాదేవి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆస్పరి మండలానికి 7, చిప్పగిరి మండలానికి 4 దరఖాస్తులు వచ్చాయి. ఆదివారం పూర్తయిన పరిశీలన అనంతరం, సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో లక్కీ డ్రా ద్వారా దుకాణాల ఎంపిక చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.