VSP: భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తయితే విశాఖలో మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో ప్రస్తావించారు. బీచ్ రోడ్డులో ఎక్స్ప్రెస్ వే, మెట్రోతోపాటు నగరంలో 16 చోట్ల ప్రతిపాదించిన ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో తెలపాలని మంత్రి నారాయణను కోరారు.