కడప: కొండాపురంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం పట్టణంలోని స్వామి వివేకానంద స్కూల్ ఆవరణంలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరం ఉంటుందని తెలిపారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్లు కోరారు.