ATP: మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో సరికొత్త శకం ప్రారంభమైందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. విజయవాడలో జరిగిన పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొన్నారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. యువగళం పాదయాత్రతో పార్టీ విజయంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.