విశాఖలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నారాయణ అసెంబ్లీలో తెలిపారు. గాజువాక నుంచి భోగాపురం వయా మద్దిలపాలెం, మధురవాడ మీదుగా 34.6 కి.మీ మేర మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలకు కేంద్రానికి పంపామన్నారు. పనులు ప్రారంభమయ్యాక నాలుగేళ్లలో పూర్తవుతుందన్నారు. ఏహెచ్ 45 నుంచి ఎన్హెచ్ 16 వరకు 6 రోడ్లు ప్లాన్ చేశామన్నారు.