AKP: కోటవురట్ల మండలం పాములవాక గ్రామంలో అంగన్వాడీ వర్కర్లు పౌష్టికాహార స్టాల్ ఏర్పాటు చేశారు. దీనిని గ్రామ సర్పంచ్ సత్యవతి, మాజీ సర్పంచ్ కిలాడి శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. స్వస్త్ నారీ-స్వస్తక్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరానికి వచ్చే మహిళలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.