GNTR: UTF ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 19 వరకు చేపట్టిన ప్రచార జాతా శుక్రవారం పెదనందిపాడు మండలానికి చేరింది. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండలంలోని ఏబీ పాలెం హైస్కూల్, జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం విద్యా రంగ సమస్యలను పరిష్కరించలేదని అన్నారు.