బాపట్ల: 36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు బాపట్ల పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డీఎంహెచ్ఓ విజయమ్మ, వైద్యులు పాల్గొని డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. రాబోయే వేసవి కాలం దృష్ట్యా డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.