KRNL: కల్లూరు మండలంలోని షరీఫ్ నగర్, లక్ష్మీపురం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న జహారాభి, రాజమ్మల తొలగింపు అన్యాయమని పేర్కొంటూ సీఐటీయూ నాయకులు డీఈవో ఎస్. శామ్యూల్ పాల్‌కు వినతిపత్రం సమర్పించారు. మంగళవారం వారు డీఈవోను కలిసి, ఈ కార్మికులకు న్యాయం చేయాలన్నారు. వినతికి స్పందించిన డీఈవో, ఈ సమస్యపై జోక్యం చేసుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.