PLD: నకరికల్లు మండలం గుండ్లపల్లిలో ఏర్పాటు అవుతున్న “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ – కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు” నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అడ్మినిస్ట్రేటివ్ భవనం, రైతుల వసతి గృహాలు, శిక్షణ శిబిరం, పంట కుంట, ప్యాక్ హౌస్, స్టోరేజ్ గోడౌన్ వంటి నిర్మాణాల పురోగతిని సమీక్షించారు.