BPT: ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరగనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రాలను బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సోమవారం ఆవిష్కరించారు. అగ్ని ప్రమాద నివారణ, సురక్షిత పద్ధతులపై అవగాహన కల్పించే ఈ వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.