ATP: పెద్దవడుగూరు మండలం భీమునిపల్లిలో భార్య మాధవిపై కత్తితో దాడి చేసిన ఈశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, దాడికి వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసిన అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించారు.