VZM: భోగాపురం మండలంలోని బొల్లింకలపాలెం గ్రామానికి చెందిన అక్క, తమ్ముడు కార్తిక శరణ్య, లోహిత్ రెడ్డి స్కేటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూర్లో జరిగిన 62వ రోలర్ స్కేటింగ్ పోటీల్లో ఇద్దరు చిన్నారులు ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు కార్తీక శరణ్య జిల్లా, రాష్ట్రస్థాయిలో 45 పతకాలు, లోహిత్ రెడ్డి 28 పతకాలు సాధించారు.