TPT: పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నవంబరు 4,11,18, 25వ తేదీలలో తెల్లవారుజామున 2 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహిస్తారు. ఉ 5 నుంచి మ. 2గంటల వరకు, సా 4.30 నుంచి రాత్రి 9 వరకు భక్తులకు దర్శనం భాగ్యం కల్పించనున్నారు.