VSP: రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచన చేశారు. విశాఖపట్నం ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ రహదారి భోగాపురం, అచ్చుతాపురం, విజయనగరం, నెర్లిమర్లను కలిపేలా ఉండాలని సీఎం తెలిపారు. ఇది కార్యరూపం దాల్చితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.