ATP: ఆర్అండ్బీ అతిథి గృహంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ శానిటరీ సిబ్బందితో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. శానిటరీ సిబ్బంది ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు ఫీల్డ్‌లో ఉండాలని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తెలిపారు. కష్టపడి పని చేస్తే మీకు ఎంతవరకైనా సహకరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.