ప్రకాశం: పామూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు ఈ నెల 22న ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ మండల అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహరెడ్డి హాజరు అవుతారని చెప్పారు. మండలంలోని ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని కోరారు.