SKLM: రాజాం పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి నీలం గోవింద రావు ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ చదివిన వారు అర్హులన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని గమనించాలన్నారు.