కోనసీమ: ప్రసిద్ధి చెందిన మండపేట శ్రీ జనార్దన్ అగస్తేశ్వర స్వామి ఆలయం( రథం గుడి) అభివృద్ధికి రూ.కోటి మంజూరు అయిందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. మండపేటలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. భక్తుల సౌకర్యం కోసం పలు అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.