KRNL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం భక్తుల రద్దీతో కళకళలాడింది. గురువారం రాఘవేంద్రులకు ప్రీతికరమైన రోజు కావడంతో గురువు రాయల బృందావనాన్ని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, గ్రామ దేవత శ్రీ మంచాలమ్మ దేవిని, గురు రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకున్నారు.