కర్నూలు: మండలంలో జరగవలసిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవోకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సూచించారు. గురువారం ఓర్వకల్లులోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఓర్వకల్లు మండల తహశీల్దార్ విద్యాసాగర్, ఎండీఓ శివ నాగ ప్రసాద్ సంబంధిత ప్రభుత్వాధికారుల,తదితరులు పాల్గొన్నారు.