చిత్తూరు: అక్రమంగా తరలిస్తున్న వాహనం సహా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు భాకరాపేట ఫారెస్టు రేంజర్ వెంకట రమణ తెలిపారు. చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ రహదారి మార్గంలోని పులబోనుపల్లె సమీపంలో తమిళనాడుకు చెందిన వారు ఎర్రచందనం దుంగలు కారులోకి లోడ్ చేస్తున్నట్టు సమాచారం వచ్చిందన్నారు. తనిఖీలు చేపట్టగా కారులో ఉన్న ఇద్దరు నిందితులు పారిపోయారన్నారు.