ELR: కైకలూరులో మండల లీగల్ సెల్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చట్టాలపై అవగాహనా సదస్సును గురువారం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మి మాట్లాడుతూ.. చిన్న పిల్లలను పనులలో పెట్టుకోకూడదని అన్నారు. మానసిక వ్యాధిగ్రస్థులను తీసుకొస్తే వారికి విశాఖ, హైదరాబాదులలో చికిత్స అందిస్తామన్నారు.