KNL: ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మంత్రి టీజీ భరత్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. 1వ వార్డులో మంత్రి పర్యటించి, సమస్యలు తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు, పందులు, కుక్కల బెడద సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటిని అధికారులు నమోదు చేసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.